కరోనా వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేందుకు తానే టీకా తీసుకున్న ఉపాసన
- దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
- పలు చోట్ల దుష్పరిణామాలు వచ్చినట్టు వార్తలు
- వెనుకంజ వేస్తున్న ప్రజలు
- భయాందోళనలు అవసరంలేదన్న ఉపాసన
హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో ఇవాళ ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తద్వారా, వ్యాక్సిన్ పై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని, ఇది సురక్షితం అని చాటే ప్రయత్నం చేశారు. ఎలాంటి సంకోచాలు అవసరంలేదని, పౌరులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపాసన సూచించారు.