మరో ఆల్ టైమ్ రికార్డుకు 'పెట్రో' ధరలు!
- ఆకాశాన్ని అంటుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు
- తాజాగా మరో 36 పైసల పెంపు
- ముంబైలో రూ. 93.62కు పెట్రోలు ధర
ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ముంబైలో పెట్రోలు ధర ఉండగా, డీజిల్ విషయంలో జైపూర్ ముందుంది. జైపూర్ లో లీటరు పెట్రోలు ధర రూ. 93.60కి చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ. 85.67కు చేరుకుంది. జైపూర్ తరువాత ముంబయిలో పెట్రోలు ధర రూ. 93.62కు, డీజిల్ ధర రూ. 83.03కు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 83.19కి చేరుకుంది.
కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరాకపోవడంతోనే ధరలను సవరించాల్సి వస్తోందని చమురు కంపెనీలు చెబుతుండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.