'నాట్యం' సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ఉపాసన
- కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటిస్తోన్న తొలి సినిమా
- తన స్నేహితురాలి సినిమా ఫస్ట్‌లుక్ అని తెలిపిన ఉపాసన
- ఈ సినిమా టైటిల్ తనకు బాగా నచ్చిందని ట్వీట్
ఈ సినిమా టైటిల్ తనకు బాగా నచ్చిందని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ లుక్‌లో సంధ్యా రాజు నాట్యం చేస్తూ కనపడుతోంది. ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.