సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'రాధే శ్యామ్' పూర్తి చేసిన పూజ హెగ్డే
- చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ అప్ డేట్
- 23న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు'
* ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంగా మలయాళ సినిమా 'లూసిఫర్'ను రీమేక్ చేయనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును ఈ నెల 21న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తారు.
* అల్లరి నరేశ్, పూజ ఝవేరి జంటగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందిన 'బంగారు బుల్లోడు' చిత్రాన్ని ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'బంగారు బుల్లోడు' సినిమాలోని 'స్వాతిలో ముత్యమంత..' అనే సూపర్ హిట్ సాంగును ఇందులో రీమేక్ చేశారు.