ఇతర పార్టీల్లో చేరొచ్చంటూ మక్కళ్ మండ్రం సభ్యులకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్!
- అనారోగ్యంతో పార్టీ పెట్టలేనన్న రజనీకాంత్
- తీవ్ర నిరాశకు గురైన రజనీ మక్కళ్ మండ్రం సభ్యులు
- డీఎంకేలో చేరిన పలువురు సభ్యులు
- కీలక ప్రకటన చేసిన రజనీకాంత్ టీమ్
మక్కళ్ మండ్రం నుంచి నేతలు ఇతర పార్టీల్లో చేరడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఎవరికి ఇష్టమైన పార్టీలోకి వారు వెళ్లొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా రజనీకాంత్ అభిమానులమన్న విషయాన్ని వారు మర్చిపోకూడదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వేసవిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. రజనీ ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని మరోపక్క ప్రచారం జరుగుతోంది.