KGF-2: చిక్కులు తెచ్చిన టీజర్: కేజీఎఫ్-2 దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు యశ్‌కు నోటీసులు

  • ఈ నెల 7న విడుదలైన కేజీఎఫ్-2 టీజర్
  • నోటీసులు జారీ చేసిన కర్ణాటక స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌
  • యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించిన టీజర్
Karnataka state anti tobacco cell sent notices to kgf 2 actor yash

ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 టీజర్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు యశ్‌లకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ టీజర్ చివరి సీన్‌లో తుపాకితో వాహనాలను వరుసగా షూట్ చేసే యశ్.. ఆ తర్వాత తుపాకి గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. అయితే, ఈ సీన్ వస్తున్నప్పుడు యాంటీ స్మోకింగ్ వార్నింగ్ వేయలేదని ఆరోపిస్తూ  కర్ణాటక స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ నోటీసులు జారీ చేసింది. ఎందుకు వేయలేదో కారణం చెప్పాలని అందులో పేర్కొంది. గతంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా, ఈ నెల 7న విడుదలైన కేజీఎఫ్-2 సినిమా టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో ఈ టీజర్ ఇప్పటికే 150కి పైగా మిలియన్ వ్యూస్ సాధించింది.

More Telugu News