సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హైవే మీద సైక్లింగ్ చేసిన రకుల్
- పక్కా ప్లానింగ్ తో సెట్స్ కి 'ఎఫ్ 3'
- చైతు సినిమా విడుదలకు ముహూర్తం
* వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా గతంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతున్న సంగతి విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగును ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తిచేసేలా షెడ్యూల్స్ వేశారట. అలాగే చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేస్తారు.
* నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని మే 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.