చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహిస్తోన్న రజనీకాంత్ అభిమానులు
- రాజకీయాల్లోకి రావాలని డిమాండ్
- రాజకీయాల్లోకి రానంటూ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్య
- వళ్లువార్ కొట్టమ్‌లో జరుగుతోన్న ప్రదర్శన
రాజకీయాల్లోకి రాకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రానంటూ ఆయన ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు అంటున్నారు.
చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్‌లో జరుగుతోన్న ఈ ప్రదర్శనలో వందలాది మంది రజినీకాంత్ అభిమానులు పాల్గొని ఆ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని పలు చోట్ల కూడా అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రజిన మక్కల్ మండ్రమ్ తరఫున ఎవరూ ఆందోళనలో పాల్గొనకూడదని ఆ సంఘం చెప్పినప్పటికీ వారు వినట్లేదు.