ప్రభాస్ 'ఆదిపురుష్'కి ముహూర్తం.. ముంబైలో షూటింగ్
- ప్రభాస్ స్ట్రెయిట్ హిందీ సినిమా 'ఆదిపురుష్'
- విలన్ గా సైఫ్ అలీఖాన్.. నాయికగా కృతి సనన్
- ఈ నెల 19 నుంచి ముంబైలో షూటింగ్
- షూటింగ్ ఎక్కువ భాగం స్థూడియోలోనే
ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును ఈ నెల 19 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్స్ వేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ షూటింగుకి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఈ స్టూడియోలోనే జరుగుతుందని సమాచారం. పౌరాణిక కథ కావడంతో వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ అవకాశం వుంది. అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తారు.