చిరంజీవి తదుపరి సినిమాలో ప్రియమణి!
- చిరంజీవి హీరోగా 'లూసిఫర్' రీమేక్
- మంజు వరియర్ పాత్రకు ప్రియమణి
- మరో ముఖ్య పాత్రలో సత్యదేవ్
- ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మాతృకలో మంజు వరియర్ పోషించిన కీలక పాత్ర ఒకటుంది. ఈ పాత్రకు గాను పలువుర్ని పరిశీలించిన మీదట తాజాగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇందులో మరో ముఖ్య పాత్రకు సత్యదేవ్ ను ఎంపిక చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' పూర్తయ్యాక, వచ్చే నెలలో దీని షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.