నాకు కూడా కరోనా సోకింది.. ఇప్పుడు తగ్గిందిలెండి: రేణు దేశాయ్
- చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నాను
- కరోనా వల్ల ఇంటికే పరిమితమయ్యాను
- ఇప్పుడిప్పుడే షూటింగులకు వెళ్తున్నాను
తాను ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిందని... త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని రేణు దేశాయ్ చెప్పారు. ఒక క్రేజీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. వీటితో పాటు రైతు సమస్యలపై తీయబోతున్న సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో లైవ్ ఛాటింగ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.