ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: బొత్స విమర్శలు
- చంద్రబాబు రామతీర్థం పర్యటన
- ఇప్పటివరకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదన్న బొత్స
- చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు
- కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపణలు
చంద్రబాబు ప్రయత్నాలన్నీ పబ్లిసిటీ కోసమేనని, ప్రచారం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. రామతీర్థంలో జరిగిన ఘటన ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం తప్ప, ఏ వ్యక్తికో, ఏ పార్టీకో సంబంధించిన అంశం కాదని బొత్స స్పష్టం చేశారు. సరిగా, డిసెంబరు 30న సీఎం జగన్ విజయనగరం వస్తున్నారని తెలిసి ఈ ఘటనకు పాల్పడినట్టు అర్థమవుతోందని, ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి ఈ కుట్ర చేసినట్టు భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.