Jr NTR: ఎన్టీఆర్ కు విలన్ గా ప్రముఖ కన్నడ నటుడు?

  • ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేస్తున్న ఎన్టీఆర్ 
  • తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 
  • ప్రధాన విలన్ పాత్రకు ఉపేంద్ర ఎంపిక
  • పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా  
Kannada Actor as villain for NTR in his next

మన సినిమాలలో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. విలన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. రెండు పాత్రలూ సమాంతరంగా సాగుతుంటాయి. స్టార్ హీరోల సినిమాలలో అయితే, విలన్లకు పవర్ ఫుల్ డైలాగులు కూడా వుంటాయి. అసలు బలమైన విలన్ ను ఎదుర్కున్నప్పుడే హీరో పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. అందుకే, ఆయా విలన్ పాత్రధారులకు మంచి పర్శనాలిటీ ఒక్కటే కాకుండా, అభినయం ప్రదర్శించగల టాలెంట్ కూడా ఉండాలి. ఆ కారణంగానే మన దర్శకులు కొత్తకొత్త విలన్లను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తదుపరి చిత్రానికి అలాంటి పవర్ ఫుల్ నటుడైన కన్నడ నటుడు ఉపేంద్రని విలన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు ఉపేంద్రను తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఉపేంద్ర ముఖ్య పాత్ర పోషించిన సంగతి విదితమే.

ఇక ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. దీనికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనేది  వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు.

More Telugu News