ప్రస్తుతానికి నెగెటివ్... పాజిటివ్ రావొచ్చేమో!: ఉపాసన కొణిదెల
- రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
- తాను కూడా టెస్టు చేయించుకున్నట్టు ఉపాసన వెల్లడి
- నెగెటివ్ వచ్చిందంటూ ట్వీట్
- రామ్ చరణ్ కోలుకుంటున్నాడని వివరణ
- హోంక్వారంటైన్ లో ఉన్నట్టు స్పష్టీకరణ
ఇప్పుడు మిస్టర్ సి (రామ్ చరణ్) తో కలిసి హోం క్వారంటైన్ లో ఉన్నానని, మిస్టర్ సి బలంగా పుంజుకుంటున్నారని ఉపాసన వెల్లడించారు. వేడి వేడి ద్రవాలు, ఆవిరి పట్టడం, విశ్రాంతి తీసుకోవడంతో సరిపోతోందని వివరించారు. అంతేకాదు, రామ్ చరణ్ తో కలిసి ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు.