మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు కూడా పాజిటివ్!
- తనకు కరోనా సోకినట్టు ఉదయం ప్రకటించిన రామ్ చరణ్
- తనకు కరోనా నిర్ధారణ అయిందని కాసేపటి క్రితం తెలిపిన వరుణ్ తేజ్
- ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నానని వెల్లడి
తనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం నిర్ధారణ అయిందని వరుణ్ తేజ్ వెల్లడించాడు. తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నానని... అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నానని తెలిపాడు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని చెప్పాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.