రజనీకాంత్ కు రేపు మరిన్ని వైద్య పరీక్షలు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
- బీపీ హెచ్చుతగ్గుల వల్ల అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
- పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దన్న డాక్టర్లు
- రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
మరోవైపు రజనీ అస్వస్థతకు గురయ్యారనే వార్తను విని ఎంతో బాధకు గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే కరోనా లక్షణాలు రజనీలో లేవని వైద్యులు చెప్పడం కొంత ఊరటనిచ్చిందని చెప్పారు. రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. ఆయన ఎంతో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా మన ముందుకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.