దిల్ రాజు బ్యానర్లో మరోసారి సిద్ధార్థ్!
- గత కొన్నేళ్లుగా వెనుకపడిన సిద్ధార్థ్
- తాజాగా 'మహా సముద్రంలో' హీరో
- సినిమా కోసం సంప్రదించిన విరించి వర్మ
ఈ క్రమంలో సిద్ధూకి తెలుగు నుంచి మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాల దర్శకుడు విరించివర్మ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రం కోసం సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చారట. గతంలో సిద్ధూ నటించిన 'బొమ్మరిల్లు' నిర్మించింది దిల్ రాజే అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.