సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఆ ధోరణి మారాలంటున్న తమన్నా
- రవితేజ సినిమా కోసం భారీ సెట్స్
- 31న థియేటర్లలో 'ఒరేయ్ బుజ్జిగా..'
* రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం కోసం హైదరాబాదులో భారీ సెట్స్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్స్ లో ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
* యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడుగా కొండా విజయకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఒరేయ్ బుజ్జిగా..' చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటించారు.