కువైట్ నుంచి వచ్చిన నా భార్య కనిపించడంలేదు: పోలీసులను ఆశ్రయించిన భర్త
- ఉపాధి కోసం కువైట్ వెళ్లిన దుర్గ
- ఈ నెల 16న గన్నవరం రాక
- ఎంతకీ ఇంటికి చేరని వైనం
- ఆందోళనకు గురైన భర్త సత్యనారాయణ
- సీసీ కెమెరా ఫుటేజ్ లో అస్పష్టత
- దర్యాప్తు ముమ్మరం చేసిన గన్నవరం పోలీసులు
గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, విమానం దిగిన తర్వాత టెర్మినల్ నుంచి వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఎయిర్ పోర్టు బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఏ వాహనం ఎక్కింది? ఎటు వెళ్లింది? అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.