ధనుశ్ చేతిలో మరో హాలీవుడ్ సినిమా
- తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు
- గతంలో 'ద ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' చేసిన ధనుశ్
- తాజాగా రూసో బ్రదర్స్ దర్శకత్వంలో 'ది గ్రే మేన్' సినిమా
- తన స్ట్రీమింగ్ కోసం నిర్మిస్తున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్
'ది గ్రే మేన్' అనే హాలీవుడ్ సినిమాలో తాను హీరోగా నటిస్తున్నట్టు, ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ సినిమాలో జెస్సికా హెన్ విక్ కథానాయికగా నటిస్తుంది. రూసో బ్రదర్స్ దీనికి దర్శకత్వం వహించనుండడం విశేషం. గతంలో 'ఎవెంజర్స్', 'కెప్టెన్ అమెరికా', 'వింటర్ సోల్జర్' వంటి చిత్రాలకు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. రెయాన్ గోలింగ్, క్రిస్ ఎవేన్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తోంది.