Pawan Kalyan: దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పవన్ సందడి... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan attends Dil Raju birthday bash

  • ఇవాళ దిల్ రాజు బర్త్ డే
  • టాలీవుడ్ ప్రముఖుల కోసం గత రాత్రి భారీ విందు
  • డీఆర్50 పేరిట పార్టీ
  • హాజరైన చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ తదితరులు
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే గత రాత్రి టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో 'డీఆర్50' పేరిట ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పవన్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, సమంత, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, కన్నడ హీరో యశ్ వంటి అగ్రతారలు దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Pawan Kalyan
Dil Raju
Birthday Bash
DR50
Tollywood
  • Loading...

More Telugu News