నంద్యాల పరిసరాల్లో బాలకృష్ణ సినిమా షూటింగు?
- బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా
- ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్
- నంద్యాల పరిసరాల్లో యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
తదుపరి షెడ్యూలును కథ ప్రకారం వారణాసిలో నిర్వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే, తాజాగా వారణాసి షెడ్యూలును కేన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరో షెడ్యూలును నంద్యాల పరిసరాల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో నంద్యాల ప్రాంతంలో కొన్ని కీలకమైన యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తారట. ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.