రాజకీయాల్లో రజనీకాంత్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను: చిరంజీవి
- స్నేహితుడు రజనీకాంత్‌కి 70వ జన్మదిన శుభాకాంక్షలు
- మున్ముందు మీరు మరింత గొప్పగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను
- ప్రత్యేకమైన మీ స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు
- కోట్లాది మందికి సేవలు అందిస్తారని నమ్ముతున్నాను
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే రజనీకాంత్ సర్. కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూ మీ జీవితం ఇలాగే కొనసాగాలి.. సినిమాల్లో స్టైల్ అనే పదాన్ని మీరు పునర్నిర్వచిస్తూ కొనసాగాలి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశారు.