సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మల్టీ స్టారర్ సినిమా షూటింగులో సమంత
- సంక్రాంతి తర్వాత 'ఇండియన్ 2' షూటింగ్
- కమేడియన్ల ఎంటర్ టైనర్ 'హౌస్ అరెస్ట్'
* కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' (భారతీయుడు సీక్వెల్) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ జరిగింది. అయితే, దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఇన్నాళ్లూ ఆగింది. ఇప్పుడు వివాదం సమసిపోయిందనీ, సంక్రాంతి తర్వాత నుంచి తదుపరి షెడ్యూలు షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.
* హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, సప్తగిరి కలసి 'హౌస్ అరెస్ట్' అనే కామెడీ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.