నేను పార్టీ మారడం లేదు: కాంగ్రెస్ నేత జానారెడ్డి వివరణ
- నన్ను ఏ పార్టీ నేతలూ సంప్రదించలేదు
- సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది
- అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే కొత్త అధ్యక్షుడు
నిన్న జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీలోని అందరి అభిప్రాయాలు సేకరించి, అందరినీ ఒప్పించిన తర్వాత హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధ్యక్షుడిగా ఎవరి పేరు సూచించారన్న ప్రశ్నకు, అది బహిర్గతం చేయాల్సిన విషయం కాదని సున్నితంగా తిరస్కరించారు.