సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సమంత నేతృత్వంలో ఓటీటీ సంస్థ?
- బాలకృష్ణ సినిమాలో ప్రముఖ నటి
- దుబాయ్ లో నితిన్ కొత్త సినిమా
- కొత్త దర్శకుడికి సాయితేజ్ గ్రీన్ సిగ్నల్
* బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో నిన్నటితరం కథానాయిక మీనా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో బాలయ్యకు మీనా భార్యగా కనిపిస్తుందని అంటున్నారు.
* హిందీలో హిట్టయిన 'అంధాదున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న దుబాయ్ లో మొదలైంది. నితిన్, నభా నటేష్ జంటపై కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
* సాయితేజ్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నూతన దర్శకుడు రామ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజక్టుకి సాయితేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ గతంలో కృష్ణవంశీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇదిలావుంచితే, సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాన్ని ఈ నెల 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.