నేను సినిమాల్లోకి రాకముందు నుంచి రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై వింటూనే ఉన్నాం: పవన్ కల్యాణ్
- రాజకీయ పార్టీపై రజనీకాంత్ స్పష్టత
- స్పందించిన జనసేనాని
- రజనీ విజయవంతం కావాలని పవన్ ఆకాంక్ష
అయితే, రజనీకాంత్ అనే కాకుండా, ఎవరైనా కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి ఒక బలమైన ఆలోచనతో వస్తున్నప్పుడు స్వాగతించాలని పవన్ తన వైఖరి వెల్లడించారు. రజనీకాంత్ కు ఎంతో బలమైన అభిమాన సమూహం ఉందని, ఆయన రాకతో మంచే జరుగుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో రజనీకాంత్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.