క్రిష్ తాజా చిత్రం టైటిల్ 'కొండపొలం'?
- వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా క్రిష్ సినిమా
- 'కొండపొలం' నవల ఆధారంగా చిత్రకథ
- 45 రోజుల్లో పూర్తిచేసిన చిత్రనిర్మాణం
- మేకప్ లేకుండా నటించిన రకుల్
లాక్ డౌన్ తర్వాత కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ వికారాబాద్ అడవుల్లో ఈ చిత్రం షూటింగును నిర్వహించారు. కేవలం 45 రోజుల్లో చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూల్ లో క్రిష్ పూర్తిచేశారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన అవార్డు నవల 'కొండపొలం' ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే, 'కొండపొలం' పేరునే ఆయన ఖరారు చేసినట్టు తాజా సమాచారం. కథకు అదే సరైన టైటిల్ అని ఆయన భావిస్తున్నారట.
ఈ చిత్రంలో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ గిరిజన యువతిగా కనిపిస్తుంది. దాంతో ఆమె మేకప్ లేకుండా ఇందులో నటించినట్టు చెబుతున్నారు. అంటే రకుల్ డీ- గ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తుందన్నమాట!