రవితేజ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో!
- రవితేజ హీరోగా రూపొందుతున్న 'ఖిలాడి'
- ప్రధాన విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్
- హీరోయిన్లుగా అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి
- రెండు పాత్రలు పోషిస్తున్న హీరో రవితేజ రవితేజ
ఈ క్రమంలో తాజాగా అర్జున్ ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటించడానికి ఓకే చెప్పారు. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతోంది. ఆమధ్య ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ఇందులో అర్జున్ ప్రధాన విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నారట. ఇప్పటికే ఆయన షూటింగులో కూడా జాయిన్ అయినట్టు సమాచారం.
ఈ సినిమాలో రవితేజ సరసన అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు చెబుతున్నారు.