రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తాను!: భేటీ తర్వాత రజనీకాంత్
- తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ
- ఆర్ఎంఎం కార్యదర్శులతో నా అభిప్రాయాలను పంచుకున్నా
- పలు సమస్యల గురించి తెలిపారు
అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడుతూ... ఆర్ఎంఎం కార్యదర్శులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. ఆర్ఎంఎం కార్యదర్శులు, నిర్వాహకులు పలు సమస్యల గురించి తెలిపారని వివరించారు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కాగా, ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. వారికి రజనీకాంత్ అభివాదం చేశారు.