టాలీవుడ్ లో ఏడేళ్లు పూర్తిచేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్... భావోద్వేగ వ్యాఖ్యలు
- అందం, అభినయంతో రకుల్ ప్రీత్ ప్రస్థానం
- కొద్దికాలంలోనే స్టార్ డమ్
- అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు
తెలుగు చిత్రసీమలో కాలుమోపిన క్షణాన ఎంత ఆనందంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే ఆనందంగా ఉన్నానని, అందుకు కారణం ఇక్కడి ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలేనని తెలిపింది. ఓ ఢిల్లీ అమ్మాయి నుంచి పక్కా తెలుగు అమ్మాయిగా తన ప్రస్థానం ఓ అందమైన అనుభూతిని మించినదని రకుల్ పేర్కొంది.
"ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకు, సహనటులకు, హితులు, సన్నిహితులకు, అభిమానులకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ, అభినందించిన వారికీ, విమర్శించడం ద్వారా నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి కారణమైన వారికీ, అందరికీ కృతజ్ఞతలు. అయితే, నా కుటుంబం, మేనేజర్, నా టీమ్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కాదేమో" అంటూ తన పోస్టులో వివరించింది.