సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఎన్టీఆర్ సినిమాలో నాయికగా రష్మిక?
- హాలిడే కోసం దుబాయ్ వెళ్లిన నితిన్
- 'డి&డి' కోసం ఇద్దరు నాయికల పేర్లు
* ఇటీవల మహేశ్ బాబు, ఎన్టీఆర్ తమ ఫ్యామిలీలతో కలసి హాలిడే కోసం దుబాయ్ వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరో నితిన్ కూడా తన భార్యతో కలసి హాలిడే ఎంజాయ్ చేయడం కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక 'అంధాదున్' రీమేక్ షూటింగులో పాల్గొంటాడు.
* మంచు విష్ణు, శ్రీను వైట్ల కలయికలో గతంలో వచ్చిన హిట్ సినిమా 'ఢీ'కి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న విషయం విదితమే. 'డి&డి' పేరుతో రూపొందే ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం అనూ ఇమ్మానుయేల్, ప్రగ్య జైస్వాల్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.