శర్వానంద్ 30వ చిత్రం షూటింగ్ పూర్తి
- శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వా 30వ సినిమా
- శర్వానంద్ సరసన నాయికగా రీతూవర్మ
- లాక్ డౌన్ తర్వాత మొదలైన షూటింగ్
- పూర్తయిందంటూ చిత్రనిర్మాణ సంస్థ ట్వీట్
ఇటీవల తమిళంలో కార్తీ హీరోగా 'ఖైదీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, లాక్ డౌన్ తర్వాత మొదలైన ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు ట్వీట్ చేసింది.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాయడం ఓ హైలైట్ అనే చెప్పాలి. ఇందులో శర్వానంద్ సరసన రీతూవర్మ కథానాయికగా నటిస్తుండగా, ఇతర వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు.