ఇక 'బంగార్రాజు' మొదలెట్టనున్న నాగార్జున!
- ప్రస్తుతం 'వైల్డ్ డాగ్'లో నటిస్తున్న నాగ్
- డిసెంబర్ తొలివారం నుంచి 'బంగార్రాజు'
- 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ఇది సీక్వెల్
- కీలక పాత్రలో నటించనున్న రమ్యకృష్ణ
దాంతో ఆ పాత్రను బేస్ చేసుకుని, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా దీని స్క్రిప్ట్ పనితో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగును ప్రారంభిస్తారని, దాదాపు సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగును పూర్తి చేస్తారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నటించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో కూడా కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.