రజనీ ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు... వివరణ ఇచ్చిన పీఆర్ టీమ్
- రజనీకాంత్ జ్వరంతో బాధపడుతున్నాడని ప్రచారం
- అంతా అవాస్తవం అని వెల్లడించిన పీఆర్ టీమ్
- రజనీ పొయెస్ గార్డెన్ నివాసంలో ఉన్నారని స్పష్టీకరణ
కొన్నాళ్లుగా రజనీ అనారోగ్యం కారణంగా సొంత పార్టీ వ్యవహారం కూడా వెనక్కి వెళ్లింది. గత నెలలో తాను అనారోగ్యానికి గురయ్యానని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొన్నిరోజుల కిందట దీపావళి సందర్భంగా రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటూ దర్శనమిచ్చారు. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.