రజనీకాంత్ ఇంట దీపావళి వేడుకలు... కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన తలైవా
- నేడు దీపావళి
- టపాసులు కాల్చుతూ సందడి చేసిన రజనీకాంత్
- ఫొటోలను పంచుకున్న రజనీ కుమార్తె
ఇటీవల అనారోగ్యం పాలయ్యారంటూ తలైవాపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకుంటూ దర్శనమివ్వడం అభిమానుల్లో ఆనందోత్సాహాలు కలిగిస్తోంది. తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రజనీకాంత్... భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు.