ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, నాగార్జున
- తెలంగాణ సీఎంతో చిరు, నాగ్ సమావేశం
- వరద విరాళాల చెక్కుల అందజేత!
- హీరోలను అభినందించిన సీఎం కేసీఆర్!
ఈ సందర్భంగా కేసీఆర్ టాలీవుడ్ అగ్రహీరోలను సాదరంగా స్వాగతించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఆయన వారిని అభినందించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను చిరు, నాగ్ కలిసిన సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.