సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- భర్తను తెగ పొగిడేస్తున్న కాజల్!
- ఓటీటీ కోసం సీనియర్ వంశీ కథలు
- నిరాశపరిచిన నితిన్ సినిమా టీఆర్పీ
* కొత్త ఒరవడితో సినిమాలు రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న ప్రముఖ దర్శకుడు వంశీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వస్తున్నారు. తాను రాసిన కొన్ని చిన్న కథలను వెబ్ డ్రామాలుగా రూపొందించనున్నారట. వీటికి తానే యాంకరింగ్ కూడా చేస్తారని తెలుస్తోంది.
* నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'భీష్మ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఈ చిత్రాన్ని జెమినీ టీవీ ప్రసారం చేయగా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదని తెలుస్తోంది. కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుందని సమాచారం.