తమన్నా, సత్యదేవ్ సినిమాలో మేఘా ఆకాశ్!
- 'లవ్ మాక్ టైల్' రీమేక్ లో సత్యదేవ్, తమన్నా
- 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ నిర్ణయం
- కీలక ప్రత్యేక పాత్రలో మేఘా ఆకాశ్
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా ఉందట. ఆ పాత్ర కోసం తాజాగా మేఘా ఆకాశ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 'లై', 'చల్ మోహన రంగా' వంటి తెలుగు చిత్రాల ద్వారా మేఘా ఆకాశ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో ఆమె కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుందని అంటున్నారు.
కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' హిట్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, చిత్రం యూనిట్ వాటిని ఒట్టి పుకార్లుగా కొట్టిపారేసింది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని పేర్కొంది.