'బ్రహ్మాస్త్ర' కోసం ముంబై వెళ్లిన నాగార్జున
- 'వైల్డ్ డాగ్' కోసం మనాలి వెళ్లొచ్చిన నాగార్జున
- 'బ్రహ్మాస్త్ర'లో ఆర్కియాలజిస్టుగా నాగార్జున
- రణబీర్, అలియా, నాగ్ కాంబోలో చిత్రీకరణ
- ముంబైలో పది రోజుల పాటు సాగే షెడ్యూలు
ఈ క్రమంలో ఇప్పుడు ముంబైలో మరో సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆర్కియాలజిస్టుగా నాగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇతర నటులతో కలసి తన కాంబినేషన్ సీన్స్ ఉండడంతో ఈయన కూడా తాజాగా షూట్ లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం నాగార్జున, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్ ల కాంబినేషన్ లో ఈ చిత్రం కోసం అక్కడ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలి. అయితే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.