ఇలాంటి సినిమాలలో భాగం కావడానికి ఇష్టపడతాను: జగపతిబాబు
- 'కలర్ ఫొటో' సినిమా అద్భుతంగా ఉంది
- ఇంత సహజసిద్ధంగా ఉన్న సినిమాను చూసి ఆశ్చర్యపోయాను
- సినిమా హిట్ కావడానికి స్టార్ డమ్ అవసరం లేదని నిరూపించారు
దర్శకుడు సందీప్ తను ఏంటో నిరూపించుకున్నాడని జగపతిబాబు అన్నారు. సుహాన్ ఒక నటుడిగానే కాకుండా, ఒక హీరోగా కూడా నిరూపించుకున్నాడని ప్రశంసించారు. సినిమా హిట్ కావడానికి స్టార్ డమ్, భారీ బడ్జెట్ మాత్రమే కారణం కాదని ఈ చిత్రం నిరూపించిందని అన్నారు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కలిసి ఇలాంటి సహజసిద్ధమైన చిత్రాన్ని తీయడం చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలలో భాగం కావడానికి తాను ఇష్టపడతానని అన్నారు. చిన్న హీరోల సినిమాలలో తాను నటించనని, తనకు అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమనే భావనతో వారు తనను సంప్రదించడం లేదని... ఈ రెండింటిలో నిజం లేదని అన్నారు.