బైడెన్‌కే జై కొడుతున్న అమెరికా యువత!
- ట్రంప్ కంటే 24 పాయింట్లు ముందున్న బైడెన్
- 56 శాతం మంది యువత మద్దతు బైడెన్‌కే
- ఓటు వేస్తామంటున్న 63 శాతం మంది యువత
2016 ఎన్నికల్లో 47 శాతం మంది యువత మాత్రమే ఓటు వేయగా, ఈసారి అది గణనీయంగా పెరగనున్నట్టు సర్వే పేర్కొంది. మరోవైపు, ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు యువతలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. యువ ఓటర్ల మద్దతు విషయంలో ట్రంప్ కంటే బైడెన్ 24 పాయింట్లు ముందున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం 56 శాతం మంది బైడెన్‌కే జై కొడుతున్నారు.