'మూడోకన్ను' తెరుస్తున్న నయనతార!
- పదిహేడేళ్లుగా కథానాయికగా నయనతార
- అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
- తాజా సినిమా 'నెట్రిక్కన్' ఫస్ట్ లుక్ విడుదల
- అంధురాలిగా విభిన్న తరహా పాత్రలో నయన్
ఈ క్రమంలో ఈ అమ్మడు తాజాగా తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహమ్' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా విభిన్న తరహా పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభిస్తోందని విఘ్నేశ్ శివన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేస్తారు!