త్రివిక్రమ్ సినిమాలో మరోసారి సమంత?
- ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ సినిమా
- ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- సమంతతో ప్రస్తుతం సంప్రదింపులు
- అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.