ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్న హీరోయిన్ కంగన.. విన్యాసాలు మామూలుగా లేవు.. వీడియో వైరల్!
- తదుపరి సినిమాలు తేజాస్, ధకాడ్ ల కోసం యాక్షన్ ట్రైనింగ్
- ఈ సినిమాల్లో ఫౌజి, స్పై పాత్రల్లో కంగన
- బాలీవుడ్ తనకు చాలా ఇచ్చిందన్న బ్యూటీ
‘నా తదుపరి సినిమాలు తేజాస్, ధకాడ్ ల కోసం నేను యాక్షన్ ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించాను. ఈ సినిమాల్లో నేను ఫౌజి, స్పై పాత్రల్లో నటించనున్నాను. బాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది. మణికర్ణిక సినిమా విజయవంతం అయిన తర్వాత నేను కూడా బాలీవుడ్ కి మొట్టమొదటి సరైన యాక్షన్ హీరోయిన్ ను ఇచ్చాను’ అంటూ కంగనా రనౌత్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.