1990లో సుస్మిత, 2020లో సంహిత... పరంపర అలా కొనసాగుతోంది: చిరంజీవి
- రుద్రమ వేషం వేసిన చిరు మనవరాలు సంహిత
- నాడు సుస్మిత కూడా ఇదే వేషం వేసిందన్న మెగాస్టార్
- పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచన
ఈ మేరకు తన మనవరాలు సంహిత రాణి రుద్రమదేవి వేషంలో అభినయించిన వీడియోను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. చిన్నారి సంహిత యాక్టింగ్ చూసి చిరు ఎంతో మురిసిపోయారు. చిన్నారుల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది అని పేర్కొన్నారు.
కాగా, సంహిత డైలాగులు చెప్పిన విధానం చూస్తే చిరంజీవి జ్ఞప్తికి వస్తారు. మ్యానరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డెలివరీ చిరును తలపించేలా ఉన్నాయి. ఆ వీడియో మీరూ చూడండి!