మంచు లక్ష్మి చిన్నప్పుడు ఇలా ఉండేది.. బర్త్ డే వేళ ఫొటో షేర్ చేసిన మోహన్ బాబు
- నా అమూల్యమైన సంపద వంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
- ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలి
- వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటిదానివి
నా అమూల్యమైన సంపద వంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మి మంచు. ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. లవ్ యూ.. హ్యాపీ బర్త్ డే లక్ష్మి మంచు అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటిదంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంచు లక్ష్మి.. 'అ! నాన్న' అంటూ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసింది.