బైకుల్లా జైలు నుంచి బయటికి వచ్చిన రియా చక్రవర్తి!
- సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం
- రియా సహా 15 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ
- నెల రోజుల జైలు జీవితం తర్వాత రియాకు బెయిల్
సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని పలుమార్లు విచారణకు పిలిపించిన ఎన్సీబీ అధికారులు ఆపై ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ కేసులో ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా మరో 13 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే షోవిక్ కు బెయిల్ లభించలేదు.