సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో తెలుగు సినిమాలో హన్సిక
- బాలకృష్ణ సినిమాలో నవీన్ చంద్ర
- 'ఇస్మార్ట్ శంకర్' హిందీ వెర్షన్లో రణ్ వీర్
* బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా భారీ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక రౌడీ ఎమ్మెల్యే పాత్రలో తను కనిపిస్తాడట.
* రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దీనిని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ వెర్షన్లో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.