కాబోయే భర్తతో కలిసి జిమ్ కు వచ్చిన కొణిదెల నిహారిక
- వెంకట చైతన్యను పెళ్లాడనున్న నిహారిక
- రెండు నెలల్లో జరగనున్న పెళ్లి
- కొంచెం బరువు పెరిగిన నిహారిక
మరోవైపు కరోనా నేపథ్యంలో గత ఆరు నెలల నుంచి ఇంటిపట్టునే ఉండటం వల్ల ఆమె కొంచెం బరువు పెరిగింది. దీంతో, బరువు తగ్గేందుకు ఆమె రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తోంది. ఈ సాయంత్రం తన కాబోయే భర్త చైతన్యతో కలిసి ఆమె జిమ్ కు వచ్చింది. జిమ్ వెలుపల తీసిన వీరిద్దరి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకు ముందు మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఆమె జిమ్ కు వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.